కామారెడ్డి, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి మెరుగైన ఉపాధి కల్పించేందుకు ఆయా శాఖలలో కలిగి ఉన్న అవకాశాలను వెలికితీయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి నైపుణ్యం కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
జిల్లాలో ఉచిత నైపుణ్య శిక్షణ, వసతి కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. అవగాహన లేక యువతి, యువకులు వినియోగించుకోవడం లేదని చెప్పారు. జిల్లాలోని ఉచిత నైపుణ్య, వసతి కేంద్రాలను యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్లూ బాట్ రోబోటిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో డోన్ ఫైలెట్ కోర్స్ ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
డోన్ యంత్రం పని చేసే విధానం , కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. రైతులు పురుగుమందులను పిచికారి చేయడం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం జరిగే వీలు ఉంటుందని చెప్పారు. పంటపై సమానంగా పురుగు మందులు పిచికారి చేసే వీలు ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ శబ్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.