కామారెడ్డి, ఫిబ్రవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లర్స్ 80 శాతం లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం రైస్ మిల్ యజమానులతో సమీక్ష నిర్వహించారు. ఇంతవరకు మిల్లింగ్ చేసిన ధాన్యం వివరాలను మిల్లుల వారీగా అడిగి తెలుసుకున్నారు.
మిల్లుల యజమానులు అధికారులు సమిష్టిగా పనిచేసి లక్ష్యాలను పూర్తి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై మేనేజర్ జితేంద్ర ప్రసాద్, జిల్లా ఇన్చార్జి పౌర సరఫరా అధికారి రాజశేఖర్, ఆర్‌డివోలు శ్రీను, రాజా గౌడ్ ,రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్ పాల్గొన్నారు.