కామారెడ్డి, ఫిబ్రవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కులాంతర వివాహం చేసుకున్న తొమ్మిది మంది దంపతులకు ఒక్కొక్కరికి రూపాయలు రెండున్నర లక్షల చొప్పున బాండ్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హనుమంత్ షిండే, జాజాల సురేందర్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారిని రజిత, అధికారులు పాల్గొన్నారు.