డిచ్‌పల్లి, ఫిబ్రవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కోర్సులైన ఎం.ఎ. అప్లైడ్ ఎకనామిక్స్, ఐఎంబిఎ, ఎం. ఎస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఎల్‌ఎల్‌బి లకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షా ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ పరీక్షలకు చెందిన జవాబు పత్రాలకు మార్చి 3 వ తేదీ వరకు రీవాల్యూయేషన్ అండ్ రీకౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో షెడ్యూల్డ్ విడుదల చేశారు.
రీవాల్యూయేషన్‌కు పేపర్ ఒక్కింటికి చొప్పున 500 రూపాయలు, రీ కౌంటింగ్‌కు పేపర్ ఒక్కింటికి చొప్పున 300 రూపాయలు, అప్లికేషన్ ఫారం కు 25 రూపాయల చొప్పున చెల్లించాలని ఆమె పేర్కొన్నారు. కావున ఈ విషయాన్ని ఆయా కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు గమనించాలని ఆమె కోరారు. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ సంప్రదించాలని ఆమె సూచించారు.