బీర్కూర్, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన సందర్బంగా ముందస్తుగా బిజెపి నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీ చేయాలని, అలాగే ఫీజు రేయంబర్సుమెంట్ బకాయిలను విడుదల చేయాలని పేర్కొన్నారు. కానీ వీటి గురించి ప్రశ్నిస్తే బీజేపీ నాయకులని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. ఉద్యోగ భర్తీలు చేయక రాష్ట్రంలో, రైతుల బాధలను పట్టిచుకోకుండా నిరుద్యోగం పెరిగి, నోటిఫికేషన్లు సకాలంలో ఇవ్వక నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అదేవిధంగా గత సంవత్సర కాలంగా సకాలంలో ఫీజు రీయంబర్సుమెంట్ రాక,పేద విద్యార్థులు విద్యకు దూరం కావాల్సి వస్తుందన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? రాచరికమా? నిరంకుశ వైఖరికి నిరసనగా రాబోవు రోజుల్లో నిరుద్యోగులకి, విద్యార్థులకు, రైతులకు ప్రజలకు బాసటగా నిలిచి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు.
కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లు, మండల ప్రధాన కార్యదర్శి శంకర్, గంగాధర్ గుప్తా పాల్గొన్నారు.