డిచ్‌పల్లి, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మైదాన ప్రాంగణంలో ఈ నెల 26 వ తేదీన బాల బాలికల క్రాస్ కంట్రీ కళాశాలాంతర్గత చాంపియన్ షిప్ – 2022 (10 కిలోమీటర్ల పరుగు పందెం) నిర్వహించ్నున్నట్లు స్పోర్ట్స్ అండ్ గేంస్ డైరెక్టర్ డా. జి. రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను గురువారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తన చాంబర్‌లో ఆవిష్కరించారు.
చాంపియన్ షిప్‌కు ముఖ్య అతిథి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివ శంకర్, ప్రత్యేక అతిథిగా విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్. ఆరతి హాజరవుతారని తెలిపారు. పోటీల్లో విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ, యూజీ, బి.ఎడ్. ఎం.ఎడ్. న్యాయ కళాశాలలో గల పరుగు పందెంలో నైపుణ్యం గల విద్యార్థి ఆటగాళ్లు పాల్గొనవచ్చని అన్నారు. చాంపియన్ షిప్‌కు కన్వీనర్‌గా ఫిజికల్ డైరెక్టర్‌గా డా. బి. ఆర్. నేతా వ్యవహరిస్తారని అన్నారు.
బ్రోచర్ ఆవిష్కరణలో వీసీతో పాటుగా ప్రధానాచార్యులు ఆచార్య ఆరతి, డైరెక్టర్ డా. జి. రాంబాబు, పీడీ డా. బి. ఆర్. నేతా, పీఎ నవీన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.