కామారెడ్డి, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూరు మండలం జంగంపల్లిలో గురువారం ప్రభుత్వ భూములను రెవిన్యూ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ పరిశీలించారు.
మ్యాప్ ఆధారంగా ప్రభుత్వ భూముల సర్వే నెంబర్ల వారిగా పరిశీలించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయన వెంట కామారెడ్డి ఇంచార్జ్ ఆర్డిఓ శీను నాయక్, అధికారులు ఉన్నారు.