కామారెడ్డి, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన నందరబోయిన వసంత (48) కు ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు కాలు తొలగించడానికి ఓ పాజిటివ్ రక్తం అవసరమని తెలియజేయడంతో వెంటనే స్పందించి పట్టణానికి చెందిన యువకుడు భరత్ 27వ సారి ఓ పాజిటివ్ రక్తాన్ని సకాలంలో ప్రభుత్వ వైద్యశాల కామారెడ్డిలో అందించి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త బాలు పేర్కొన్నారు.
రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న వారికి ఎల్లవేళలా రక్తాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని, అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం అవసరమైతే 9492874006 నెంబర్‌కు సంప్రదించాలన్నారు.