కామారెడ్డి, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ విజయ సేన రెడ్డిని శుక్రవారం కామారెడ్డి జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టులో కలిశారు. కామారెడ్డిలో రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, పోక్సో కోర్టు వెంటనే ఏర్పాటు చేయాలని, కామారెడ్డి కోర్టులోని సమస్యలను పరిష్కరించాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞాపన పత్రం అందజేశారు.
కోర్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్‌టెన్షన్ కౌంటర్, ఎటిఎం ఏర్పాటు చేయాలని, కోర్టులో సెకండ్ ఫ్లోర్ నిర్మించాలని కోరారు. వీటిని వెంటనే ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్ విజయ సేనా రెడ్డి బార్ అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి, ప్రధాన కార్యదర్శి కోల శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యక్షులు జోగుల గంగాధర్ సీనియర్ న్యాయవాదులు గోనెల జగన్నాథం, కాసర్ల శ్రీనివాస్, చింతల గోపి, మాయ సురేష్, గౌరనీ శ్రీనివాస్, తెలంగాణ బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు సునీల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టు జడ్జి జస్టిస్ విజయ సేన రెడ్డిని ఘనంగా సన్మానించారు.