నవీపేట్, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామంలో నూతనంగా నిర్మించబోయే చెక్ డ్యాం పనులని ఇరిగేషన్ డిపార్టుమెంట్ అధికారులు పరిశీలించారు. ఐతే పురాతన మాటుకాలువ పూర్తిగా దెబ్బతినడంతో పై నుండి వచ్చే వర్షపు నీరు కారణంగా మాటు కాలువ దెబ్బతిని కింద ఉన్న రైతుల పంట పొలాల్లో నీరు చేరి చాలా వరకు నష్ట పోతున్నారని, మాటు కాలువ ఊరికి ఆనుకొని ఉండడం వల్ల నీళ్ళు ఊళ్ళోకి వస్తున్నాయని గ్రామ సర్పంచ్ ద్యగా సరిన్ ఇరిగేషన్ అధికారులకి తెలిపారు.
ఈ సందర్బంగా నూతన కాలువని నిర్మించాలని కోరుతూ వారికి వినతిపత్రం ఇచ్చినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఎస్.ఇ బద్రి నారాయణ, ఏ.ఇ.ఇ వీరాస్వామి, డిఇ బలరాం, ఏ.ఇ. శ్రీనివాస్ రైతులు శ్రీనివాస్, సుదర్శన్, నడిపి భోజన్న, రాజు, భూషణ్, స్వామి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.