బాధిత కుటుంబానికి చెక్కు అందజేత

ఆర్మూర్‌, ఫిబ్రవరి 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణములోని వడ్డెర కాలోనికి చెందిన వరికుప్పల గంగాధర్‌ తెరాస కార్యకర్త గత రెండు సంవత్సరాల క్రితం నిర్మాణములో వున్న ఇంటికి సెంట్రింగ్‌ పనులు చేస్తుండగా రెండు అంతస్తుల భవనంపై నుండి ప్రమాదవశాత్తు క్రింద పడి బలమైన గాయాలతో చనిపోయాడు. అప్పుడు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి స్థానిక కౌన్సిలర్‌ సంగీత ఖాందేశ్‌ చేయించిన తెరాస పార్టీ సభ్యత్వం ద్వారా రెండు లక్షలు పార్టీ నుంచి ఇప్పించారు.

చనిపోయిన వ్యక్తికి భవన నిర్మాణ కార్మిక సభ్యత్వం కూడా కౌన్సిలర్‌ చేయించి ఉన్నందున ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఆర్మూర్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ రాజేశ్వర్‌రెడ్డి ఇటీవల అతని కుటుంభ సభ్యులకు కార్మిక శాఖా ద్వారా మంజూరు చేసిన 6 లక్షల 30 వేల రూపాయల చెక్కును కౌన్సిలర్‌ మరియు బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు సంగీతా ఖాందేష్‌ చేతుల మీదుగా ఇప్పించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం ద్వారా, టిఆర్‌ఎస్‌ పార్టి ద్వారా డబ్బులు ఇప్పించి తమ కుటుంబాన్ని ఆదుకున్న ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి, నియోజకవర్గ ఇంచార్జి రాజేశ్వర్‌రెడ్డికి కృత్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమములో తెరాస నాయకులు ఖాందేష్‌ సత్యం, బండారి నరేశ్‌, మక్కల సాయిలు, భూమేష్‌, ప్రశాంత్‌ తదితరులు వున్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »