టీయూలో ‘‘లీడర్‌ షిప్‌ మీట్‌’’ స్ఫూర్తిదాయక సదస్సు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాల సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ‘‘లీడర్‌ షిప్‌ మీట్‌’’ అన్న అంశం మీద స్ఫూర్తిదాయక సదస్సు నిర్వహించనున్నారు.

ఎక్సెల్‌ ఇండియా మరియు తెలంగాణ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించపోయే సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డ్‌ వైస్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజక వర్గం శాసనసభ్యులు, ఆర్‌టిసి చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రి, తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, ఉబుంటు ట్రస్ట్‌ చైర్మన్‌, సీనియర్‌ ఐఎఎస్‌ రిటైర్డ్‌ టి. చిరంజీవులు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పూర్వ చైర్మన్‌ ఆచార్య టి. పాపిరెడ్డి, సురభి గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యూకేషనల్‌ ఇన్సిట్యూషన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురభి అజిత, తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌, తెలంగాణ విశ్వవిద్యాలయ పాలక మండలి చైర్మన్‌ డా. ఎం. మారయ్య గౌడ్‌, ఆర్కే గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యూకేషనల్‌ ఇన్సిట్యూషన్స్‌ సిఇఒ డా. జైపాల్‌ రెడ్డి, తెలంగాణ ఎలక్ట్రానిక్స్‌ మానిఫాక్చరింగ్‌ అసోసియేషన్‌ పూర్వాధ్యక్షులు విజయ్‌ కుమార్‌ గుప్త, ఉషోదయ గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యూకేషనల్‌ ఇన్సిట్యూషన్స్‌ చైర్మన్‌ సూర్య ప్రకాష్‌, ఎక్సెల్‌ ఇండియా ప్రధాన సంపాదకులు రామకృష్ణ సంగెం, ఎక్సెల్‌ ఇండియా సీనియర్‌ ఎడిటర్‌ రామ్మోహన్‌ పులిపాటి, ది హన్స్‌ ఇండియా డిప్యూటి ఎడిటర్‌ భాస్కర్‌ తాటికొండ తదితర ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, సామాజిక విశ్లేషకులు, విద్యావేత్తలు, పత్రికా రంగ నిపుణులు హాజరు కానున్నారు.

కావున కార్యక్రమానికి టీయూ అద్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని లీడర్‌ షిప్‌ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని, సదస్సును విజయవంతం చేయాలని కోరారు.

Check Also

కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »