కామారెడ్డి, ఫిబ్రవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో చేపడుతున్న ప్రగతి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం వార్డుల వారీగా చేపట్టిన ప్రగతి పనులపై ఇంజనీరింగ్ అధికారులతో ప్రభుత్వ విప్ సమీక్ష నిర్వహించారు.
మురుగు కాలువలు, సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణం పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రారంభం కాని పనులను పంచాయతీరాజ్ అధికారులతో పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, సిపిఓ రాజారాం, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మునిసిపల్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.