గ్రామీణ సమస్యలను పరిష్కరించే ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు టిఎస్‌ఐసి ఆర్థిక సహకారం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ఆవిష్కరణలకు తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్స్‌ ఫర్‌ రూరల్‌ ఇంపాక్ట్‌ ఇన్సెంటివ్స్‌ (టిఎస్‌ఐఆర్‌ఐఐ) ద్వారా ఆర్థిక సహకారం అందించేందుకు ఆవిష్కర్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

గ్రామీణ సమస్యలను పరిష్కరించే ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ ఐ.టి అండ్‌ సి విభాగం జూలై 2021న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నోడల్‌ ఏజెన్సీగా టిఎస్‌ఐసి వ్యవహరిస్తోందని, టిఎస్‌ఐఆర్‌ఐఐ ద్వారా ప్రోత్సాహకాల కోసం 30 లక్షల కార్పస్‌ ఫండ్‌ కేటాయించబడిరదని కలెక్టర్‌ వివరించారు. వివిధ దశల్లో ఉన్న ఆవిష్కరణలు, స్టార్టప్‌లు ఆర్థిక సహాయం కోసం ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ సమస్యల పరిష్కారం కోసం అనేక ఆవిష్కరణలు వెలుగు చూస్తున్నాయని, వీరికి ఆర్థిక చేయూత అందించి ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం దీనిని ప్రారంభించిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర గుర్తింపు పొంది ఉన్న ఆవిష్కరణ, స్టార్టప్‌లు లేదా పూర్తిగా రాష్ట్రంలోనే అభివృద్ధి చేయబడ్డ ఆవిష్కరణలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. అర్హత కలిగిన ఆవిష్కరణలు / స్టార్టప్‌లు వెబ్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. స్వీకరించబడిన దరఖాస్తులను టిఎస్‌ఐసి స్థాపించిన గ్రాస్‌రూట్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ పరిశీలించి నిధులు అందజేస్తుందని తెలిపారు. అవకాశాన్ని అర్హులైన ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »