కామారెడ్డి, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి 2న బుధవారం ఉదయం 11 గంటలకు రాజీవ్ స్వగృహ (ధరణి టౌన్షిప్) లో ప్లాట్ల బహిరంగ వేలంపై అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.
సమావేశానికి జిల్లాలోని రియల్ ఎస్టేట్ (స్థిరాస్తి వ్యాపారులు), ఇతరులు ఆసక్తి గల వ్యక్తులు హాజరు కావాలని కోరారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.