ఆర్మూర్, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్మూర్ మండల అధ్యక్షునిగా ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామ ఉప సర్పంచ్ ముక్కల లింగన్నని నియమించారు. బీసీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటు బలహీన వర్గాలను రాజ్యాధికారం తెచ్చెందుకు కృషి చేస్తారని, ఆర్మూర్ మండల పరిధిలో విస్తృతంగా పర్యటించి బీసీలను చైతన్య పరుస్తారని, గ్రామ గ్రామాన బీసీ కమిటీలను ఏర్పాటు చేసి గ్రామాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలన్నారు.
కార్యక్రమంలో బీసీ పోలిటికల్ అవేర్నెస్ కమిటీ జిల్లా కన్వీనర్ చింత దేవిదాస్, విశ్రాంత ఉద్యోగ సంఘాల కన్వీనర్ మంచిరాల ప్రభాకర్ చారి, కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ జోగన్ పల్లి సంతోష్ గౌడ్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి శృంగారం ప్రవీణ్ కుమార్, జిల్లా నాయకులు అబ్బగోని అనిల్ కుమార్, వెల్పుల సతీష్, పత్తెపూర్ ఎంపిటీసి కొక్కుల హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.