ఆర్మూర్, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బిఎంఎస్ (భారతీయ మజ్దూర్ సంఫ్‌ు) కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ ఆధ్వర్యంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఇందులో భాగంగా ఆర్మూర్ డివిజన్ ఇంఛార్జిగా బి.మహేష్ కుమార్‌ని నియమించారు. మహేశ్‌కుమార్ గతంలో ఏబివిపిలో ఆర్మూర్ డివిజన్ కన్వీనర్‌గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పని చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రామిరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎర్రం స్వామి, జిల్లాకన్వీనర్ శివగౌడ్, అంబరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్లోని ఉద్యోగులు, అసంఘటిత కార్మికుల అభివృద్ధి కొరకు పాటుపడతానని చెప్పారు.