డిచ్‌పల్లి, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల సమావేశ మందిరంలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘‘జాతీయ సైన్స్ డే వేడుకలు’’ సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య ఆర్ లింబాద్రి, తెలంగాణ విశ్వవిద్యాల్య ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ఆచార్య టి. పాపిరెడ్డి విచ్చేసి ప్రసంగించారు. సర్ సివి రామన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విజ్ఞానానికి, ఆధునిక మానవ జీవనానికి ఎంతటి అవినాభావ సంబంధం ఉందో తెలిపారు. సైన్స్ రంగంలో అనేక అవకాశాలను అంది పుచ్చుకోవాలని సూచించారు.
కార్యక్రమానికి ప్రధాన వక్తగా హైదరాబాద్ నుంచి సిసిఎంబి శాస్త్రవేత్త డా. నీరడి దినేష్ విచ్చేసి ‘‘కరోనా వైరస్ మార్టేషన్స్’’ అనే అంశంపై ప్రసంగించారు. కార్యక్రమానికి క్యాంపస్ విద్యార్థులు, అనుబంధ కళాశాలల విద్యార్థులు హాజరైనారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్, పోస్టర్ ప్రజంటేషన్ నిర్వహించారు. గెలుపొందిన వారికి నగదు పురస్కారంతో పాటు సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. కార్యక్రమాన్ని విభాగాధిపతి డా. జి. బాల కిషన్, బిఒఎస్ డా. బి. సాయిలు, అసోసియేట్ ప్రొఫెసర్ డా. నాగరాజ్ నిర్వహించారు.