Monthly Archives: February 2022

ఘోర రోడ్డు ప్రమాదం – దంపతుల మృతి

కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోమకొండ పెట్రోల్‌ పంపు వద్ద డీసీఎం వ్యాన్‌, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు రమేశ్‌ (46), సరస్వతి (38)గా గుర్తించారు. వీరి స్వస్థలం మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం నష్కల్‌. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి …

Read More »

నీట్‌లో భీమ్‌గల్‌ విద్యార్థిని ప్రతిభ

భీమ్‌గల్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణ కేంద్రంలోని వ్యాపారవేత్త అయిన అరే రఘు, సునీతల కూతురు అరే తేజస్విని 2021 నీట్‌ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనపర్చి తన సత్తా చాటుకుంది. అందుకుగాను అరే తేజస్వినికి నేషనల్‌ ఎంట్రన్స్‌ కం ఎలిజిబిల్‌ టెస్ట్‌లో అల్‌ ఓవర్‌ ఇండియాలో 5363, ఓబిసి రిజర్వేషన్‌లో 1868, తెలంగాణలో 161 ర్యాంక్‌ సాధించినందుకు సోమవారం వేల్పూర్‌ రోడ్డులోని …

Read More »

అర్హులకు రెండు పడక గదుల ఇళ్ళు ఇవ్వాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవనగర్‌ కాలనిలో నిర్మించిన డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల ఎదుట అర్హులకు డబల్‌ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 16 కోట్ల రూపాయలతో నిర్మించిన డబల్‌ బెడ్‌రూమ్‌ …

Read More »

ఈ నెల 18 వరకు ఆర్థిక అక్షరాస్యత వారం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గో డిజిటల్‌ గో సెక్యూర్‌ అనే అంశంపై భారతీయ రిజర్వ్‌ బ్యాంకు ఈ నెల మూడవ వారాన్ని ఆర్థిక అక్షరాస్యత వారంగా నిర్ణయించిందని లీడ్‌ బ్యాంక్‌ జిల్లా మేనేజర్‌ యు ఎన్‌. శ్రీనివాసరావు తెలిపారు. దీనిని పురస్కరించుకుని రూపొందించిన గోడ ప్రతులను సోమవారం స్థానిక ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎల్‌డీఎం శ్రీనివాసరావు …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 76 ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత …

Read More »

మౌలిక వసతుల కోసం ప్రతిపాదనలు తయారుచేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా మండలాల వారీగా 100 మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. పాఠశాలలో అదనపు గదులు, మౌలిక వసతుల కోసం అధికారులు …

Read More »

ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. శాఖల వారీగా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా …

Read More »

18న మేడారం వెళ్లనున్న సీఎం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్‌ కుటుంబసమేతంగా జారతకు వస్తారన్నారు. జాతరకు అన్ని వర్గాల ప్రజలు సహరించాలని కోరారు. రాజకీయాలతో సంబంధం లేకుండా జాతర విజయవంతం చేయాలన్నారు. మేడారం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా 34 పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. …

Read More »

22 నుంచి బి.ఎడ్‌. ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ బి.ఎడ్‌. కళాశాలలోని రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు ఈ నెల 22 నుంచి 25 వ తేదీ వరకు జరుగనున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ రివైస్డ్‌ షెడ్యూల్డ్‌ వెలువరించారు. పరీక్షలు ఉదయం 10-12 గంటల వరకు, గిరిరాజ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో జరుగుతాయన్నారు. కావున ఈ …

Read More »

టియులో అంతర్‌ డిగ్రీ, పీజీ కాలేజ్‌ క్రికెట్‌ టోర్నీ ….

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 17 వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే, టిఎస్‌ ఆర్‌టిసి ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ జన్మదిన సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీలో అంతర్‌ డిగ్రి మరియు పీజీ కళాశాలాల టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ టోర్నీ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి జేఏసి అధ్యక్షుడు యెండల ప్రదీప్‌, టిఆర్‌ఎస్‌వి జిల్లా కో ఆర్డినెటర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »