డిచ్‌పల్లి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మైదాన ప్రాంగణంలో ఈ నెల 26 వ తేదీన బాల బాలికల క్రాస్ కంట్రీ కళాశాలాంతర్గత చాంపియన్ షిప్ – 2022 (10 కిలోమీటర్ల పరుగు పందెం) నిర్వహించ్నున్నట్లు స్పోర్ట్స్ అండ్ గేంస్ డైరెక్టర్ డా. జి. రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను గురువారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తన …
Read More »Monthly Archives: February 2022
ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు
కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూరు మండలం జంగంపల్లిలో గురువారం ప్రభుత్వ భూములను రెవిన్యూ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ పరిశీలించారు. మ్యాప్ ఆధారంగా ప్రభుత్వ భూముల సర్వే నెంబర్ల వారిగా పరిశీలించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయన వెంట కామారెడ్డి ఇంచార్జ్ ఆర్‌డిఓ శీను నాయక్, అధికారులు ఉన్నారు.
Read More »సంక్షేమ పథకాలను చూసి ప్రపంచమే అబ్బురపడుతుంది
కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందడుగు వేశారని, దాన్ని పూర్తి చేసి తెలంగాణ రైతులకు గోదావరి జలాలతో పంటలు పండే విధంగా చూశారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఆయన ఆర్ అండ్ బి …
Read More »శ్రమను ఆయుధంగా మలచుకుంటే లక్ష్యం సిద్ధిస్తుంది
నిజామాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రమను ఆయుధంగా మల్చుకుని అకుంఠిత దీక్షతో కృషి చేస్తే అనుకున్న లక్ష్యం తప్పనిసరిగా నెరవేరుతుందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి విద్యార్థులకు ఉద్బోధించారు. అంతంతమాత్రంగానే సదుపాయాలూ అందుబాటులో ఉండే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, పేద కుటుంబాలకు చెందిన వారికి చదువు ఒక్కటే ఏకైక ఆయుధమని ఆయన పేర్కొన్నారు. మోస్రా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా …
Read More »నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర – నిజామాబాద్ ఆధ్వర్యంలో జిల్లా యువజన పార్లమెంట్ కార్యక్రమం గురువారం బోధన్ పట్టణంలోని మహాలక్ష్మీ కల్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘురాజ్ మాట్లాడుతూ యువత తమ భవిష్యత్ కోసం మంచి ప్రణాళికతో పని చెయ్యాలని, తమ కుటుంబం, గ్రామం తద్వారా దేశం మొత్తానికి ఉపయోగపడే విధంగా …
Read More »బీజేపీ నాయకుల అరెస్ట్
బీర్కూర్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన సందర్బంగా ముందస్తుగా బిజెపి నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీ చేయాలని, అలాగే ఫీజు రేయంబర్సుమెంట్ బకాయిలను విడుదల చేయాలని పేర్కొన్నారు. కానీ వీటి గురించి ప్రశ్నిస్తే బీజేపీ నాయకులని అరెస్ట్ …
Read More »అట్రాసిటీ కేసుల్లో త్వరితగతిన చార్జ్ షీట్ దాఖలు చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా చార్జ్ షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్ లో కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ …
Read More »ఇదీ మా ఎనిమిదేండ్ల ప్రగతి
నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ‘‘నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో గత ఎనిమిదేండ్లలో ఇదీ మేము చేసిన అభివృద్ధి. ఇన్ని కోట్ల నిధులు తెచ్చాము. ఎంపీగా నువ్వేం తెచ్చావో ప్రజలకు చెప్పు’’ అని పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి నిలదీశారు. నిజామాబాద్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిజామాబాద్ జిల్లాలో గత …
Read More »వాక్-ఇన్ ఇంటర్వ్యూ
నిజామాబాద్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, టిఎస్ హైదరాబాద్ ప్రభుత్వంలో పనిచేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1 (ఒక) సంవత్సరం పాటు సీనియర్ రెసిడెంట్స్ (ఎస్‌ఆర్) మరియు జూనియర్ రెసిడెంట్స్ (జెఆర్) ఖాళీలను భర్తీ చేయడానికి అనుమతించబడిరది. వైద్య కళాశాల / ప్రభుత్వ. జనరల్ హాస్పిటల్, నిజామాబాద్. దరఖాస్తుల స్వీకరణ 24.02.2022 నుండి 02.03.2022 వరకు ఉదయం 10.30 నుండి సాయంత్రం …
Read More »ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగంలో పాపులర్ సైన్స్ లెక్చర్
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 28 వ తేదీన నిర్వహించ తలపెట్టిన జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ పాపులర్ సైన్స్ లెక్చర్స్‌లో భాగంగా బుధవారం మధ్యాహ్నం అస్సాం రాష్ట్రంలోని జోర్హార్ నుంచి నీస్ట్ లాబోరేటరీ జాతీయ పరిశోధన సంస్థ డైరెక్టర్ డా. గరికపాటి నరహరి శాస్త్రి ప్రధాన వక్తగా విచ్చేసి ‘‘ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్సీ ఇన్ కెమిస్ట్రీ …
Read More »