నిజామాబాద్, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇండోర్‌లో జరిగిన హిందీ గౌరవ్, కావ్య గౌరవ్, హిందీ యోద్ధ పురస్కార సన్మాన వేడుకలో సీనియర్ జర్నలిస్టు మరియు విశ్లేషకులు కృష్ణ కుమార్ అష్టాన మరియు సీనియర్ కథా రచయిత్రి డా. కృష్ణ అగ్నిహోత్రికికి హిందీ గౌరవ్, అలాగే శ్రీమన్నారాయణాచార్యకు ‘‘హిందీ యౌద్ధ’’ పురస్కార సమ్మానం లభించింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్ మంత్రి తులసి సిలావత్, సీనియర్ జర్నలిస్టు విద్యావేత్త డాక్టర్ వేదప్రతాప్ వైదిక్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అరవింద్ తివారీ హాజరయ్యారు. అతిథులచే దీప ప్రకాశనం తరువాత, సంస్థ స్వాగతం అధ్యక్షులు డాక్టర్ అర్పణ్ జైన్ ‘అవిచల్’ స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్య అతిథి, కేబినెట్ మంత్రి తులసీ సిలావత్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం జాతీయ భాష హిందీలో వైద్య, ఇంజనీరింగ్ విద్యను రూపొందిస్తుందని, అది ప్రారంభించబడిరదని, ఇప్పుడు దేశవ్యాప్తంగా హిందీ పండితులు, భాషావేత్తలు, విషయ నిపుణులు హిందీ భాషలో పుస్తకాలు రాస్తున్నారని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్, ఏళ్ల తరబడి హిందీ కోసం పనిచేస్తున్న డాక్టర్ వేద్ప్రతాప్ వైదిక్ మాట్లాడుతూ నేడు హిందీయేతర రాష్ట్రాలలో మనం మరింతగా యుద్ధప్రాతిపదికన కృషి చేయాలని అన్నారు. మాతృభాష ఉన్నయన్ సంస్థాన్ హిందీలో సంతకం చేయనున్నారనే ప్రచారాన్ని డాక్టర్ వైదిక్ ప్రశంసించారు. ఇతర వ్యక్తులు కూడా దీనిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.
ఈ సందర్భంగా హిందీ సాహిత్యాన్ని దక్షిణాదిలో గర్వించేలా చేస్తున్న అంకిత భావంతో కూడిన హిందీ కవి, సాహిత్యకారులు శ్రీమన్నారాయణచారి ‘‘విరాట్’’ని మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి తులసీ సిలావత్ జీ ముత్యాల మాలతో, వేదప్రతాప్ వైదిక్ హిందీ యోద్ధ సమ్మాన్‌తో సత్కరించారు. కార్యక్రమాన్ని అన్షుల్ వ్యాస్ నిర్వహించగా అమిత్ జైన్ మౌలిక్ కృతజ్ఞతలు తెలిపారు.