కామారెడ్డి, మార్చ్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయి కృష్ణ వైద్యశాలలో లింగంపేట మండలము పరమళ్ల గ్రామానికి చెందిన సావిత్రి (28) కి గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త బాలుకు తెలియజేయడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ వెంటనే స్పందించి సకాలములో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడారు.
ఈ సందర్భంగా డాక్టర్ వేదప్రకాష్ మాట్లాడుతూ రక్తదానం పట్ల అపోహలు విడనాడాలని అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని, మానవసేయే మాధవ సేవ అని అన్నారు. కరోనా సమయములో 100 యూనిట్ల ప్లాస్మాను 982 యూనిట్ల రక్తాన్ని అందజేయడం జరిగిందనీ, ఆపదలో ఉన్న వారికి ఎల్లవేళలా రక్తం అందించడానికి సిద్ధంగా ఉన్నామని బాలు తెలిపారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత డాక్టర్ వేదప్రకాశ్‌ను కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ తరఫున అభినందించారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్, శ్రీకాంత్, సాయికుమార్ పాల్గొన్నారు.