కామారెడ్డి, మార్చ్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి 7న సోమవారం ఉదయం 11:00 గంటలకు రాజీవ్ స్వగృహ (ధరణి టౌన్షిప్) లో ప్లాట్ల బహిరంగ వేలంపై గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. బుధవారం ఆయన ధరణి టౌన్‌షిప్‌లో స్థిర వ్యాపారుల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మార్చి 14 నుంచి 17 వరకు కొన్ని కొన్ని ప్లాట్లు చొప్పున విక్రయిస్తామని చెప్పారు. ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనవచ్చని సూచించారు. 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం సమీపంలో ధరణి టౌన్షిప్ ఉందని చెప్పారు. మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ ప్లాట్లకు డిటిసిపి లేఅవుట్ అప్రూవల్ ఉందని తెలిపారు. 100, 150, 200, 266 చదరపు గజాల ప్లాట్లు ఉన్నాయని సూచించారు.
40 అడుగుల ప్రధాన రహదారులు, 30 అడుగుల అంతర్గత రహదారులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈఎండి రూ.10 వేలు కలెక్టర్ కామారెడ్డి పేరున డిడి రూపంలో చెల్లించవలసి ఉంటుందని చెప్పారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు 90 రోజుల్లో పూర్తి డబ్బులు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. ఈ సువర్ణ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేలంలో పాల్గొన్న వ్యక్తులు తమ వెంట ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా, ఏదైనా గుర్తింపు పత్రములు తీసుకురావాలని పేర్కొన్నారు.
సదస్సులో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న అరుదైన అవకాశాన్ని ప్రజలు సొంతం చేసుకోవాలని కోరారు. ఎటువంటి చిక్కులు లేని ఓపెన్ ఫ్లాట్ లను ప్రత్యక్ష వేలం ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. సదస్సులో ఆర్డిఓ శీను, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, ఏజీఎం సత్యనారాయణ, టిఐసిసి జోనల్ మేనేజర్ రాందాస్, అధికారులు, స్థిరాస్తి వ్యాపారులు పాల్గొన్నారు.