కామారెడ్డి, మార్చ్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలో 41వ వార్డ్ అంగన్వాడీ సెంటర్ను బుదవారం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తనిఖీ చేశారు. గర్భిణీలు, బాలింతలు పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. కేంద్రంలో గుడ్లు, పప్పు, నూనె పదార్ధాలు, పౌష్టికాహార ఆవశ్యకతను వివరించారు. కలెక్టర్ వెంట 41 వార్డ్ కౌన్సిలర్ కాళ్ళ రాజమణి గణేష్, అంగన్వాడీ సిబ్బంది, ఆశ సిబ్బంది, వార్డ్ సభ్యులు ఉన్నారు.