కామారెడ్డి, మార్చ్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకార వేతనాలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వంద శాతం అందేలా ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జరిగిన జూమ్ మీటింగ్‌లో జిల్లా కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు.
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల దరఖాస్తులను పూర్తి చేసి ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలని పేర్కొన్నారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసినప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా చూడాలన్నారు. జూమ్ మీటింగ్‌లో జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి రజిత, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.