డిచ్‌పల్లి, మార్చ్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాల విద్యార్థలకు (బాలురు – బాలికలు) ఇటీవల స్పోర్ట్స్ అండ్ గేంస్ డిపార్ట్ మెంట్ నుంచి క్రాస్ కంట్రీ చాంపియన్ షిప్ (10 కి.మీ) పరుగు పందెం నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రధాన ప్రాంగణంలోని అఫ్లైడ్ ఎకనామిక్స్ విభాగం మూడవ సంవత్సరానికి చెందిన విద్యార్థి ఎస్. మల్లేష్ గెలుపొందడంతో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తన చాంబర్‌లో ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ… విశ్వవిద్యాలయం నుంచి ఆరుగురు క్రీడాకారులు గెలుపొందగా అందులో ఐదవ స్థానంలో ఎస్. మల్లేష్ నిలిచారని అన్నారు. మిగతా వారందరు అనుబంధ కళాశాలకు చెందిన వారని అన్నారు. వీరందరు మార్చి 10 న కర్ణాటకలోని మంగుళూరు యూనివర్సిటీలో జరిగే ఆల్ ఇండియా ఇంటర్ క్రాస్ కంట్రీ చాంపియన్ షిప్ – 2022 లో పాల్గొంటారని అన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయం క్రీడలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందన్నారు. క్రీడాకారులు తప్పక విజయం సాధించి వస్తారని ఆశాభావం వ్యక్త చేశారు. కార్యక్రమంలో వీసీతో పాటు రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, డైరెక్టర్ డా. రాంబాబు, అప్లైడ్ ఎకనామిక్స్ విభాగాధిపతి టి. సంపత్, సోషల్ వర్క్ విభాగాధిపతి డా. శర్మ, పీఆర్‌ఓ డా. వి. త్రివేణి, పీడీ నేతా తదితరులు పాల్గొన్నారు.