కామారెడ్డి, మార్చ్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఆర్డీవో కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. బాన్సువాడ, బిచ్కుంద తహసిల్దార్ కార్యాలయాలను సందర్శించారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
బిచ్కుంద లోని శివ బాలాజీ, మహేక్ రైస్ మిల్‌లను సందర్శించారు. లక్ష్యానికి అనుగుణంగా ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని రైస్ మిల్ యాజమానులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డివో రాజా గౌడ్, బాన్సువాడ, బిచ్కుంద తహసీల్దార్లు గంగాధర్, ఆనంద్, ఇంచార్జ్ జిల్లా సివిల్ సప్లై అధికారి రాజశేఖర్, అధికారులు పాల్గొన్నారు.