ధర్పల్లి, మార్చ్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం మేనమామ పెండ్లి కానుకగా ప్రవేశ పెట్టిన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ సంక్షేమ పథం ద్వారా అందిస్తున్న చెక్కులను మంత్రి కేటిఆర్ సూచన మేరకు ధర్పల్లి తహసిల్దార్ సహకారంతో రామడుగు గ్రామానికి మంజూరైన 95 చెక్కులను ఇంటింటికి వెళ్లి అందించడం ఆనందంగా ఉందని జడ్పిటిసి బాజిరెడ్డి జగన్ మోహన్ అన్నారు.
శుక్రవారం దర్పల్లి మండలంలోని రామడుగు, కేసరం, మైలారం, చల్లగర్గ, దుబ్బాక, ఎస్బి తండా, డిబి తండా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి చెక్కులను అందించిన సమయంలో మహిళల కండ్లలో కనిపించిన ఆనందం వెలకట్టలేనిదని అన్నారు. గతంలో మండలానికి వచ్చి లబ్దిదారులు కళ్యాణ లక్ష్మి చెక్కులను తీసుకెళ్లె వారని అందుకు భిన్నంగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి స్థానిక నాయకులు అందజేయాలని చేసిన సూచన, స్థానిక అధికారుల సహకారంతో పంపిణి చేయడం జరిగిందన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా స్థానిక ప్రజలతో కలిసి చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటిఆర్ సూచించారని అన్నారు. టిఎస్ ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నలాగా మహిళలకు వెన్నంటి ఉంటూ సంక్షేమ పథకాలు లబ్దిదారులకు చేరే విధంగా చూస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ నల్ల సారిక హన్మంత్, మండల తెరాస పార్టీ ప్రెసిడెంట్ మహిపాల్, కేసిఆర్ సేవాదళ్ రూరల్ కన్వీనర్ దేవేందర్, మండల యూత్ ప్రెసిడెంట్ రంజిత్, సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.