డిచ్‌పల్లి, మార్చ్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగంలో ఎల్‌ఎల్‌బి కోర్సుకు చెందిన ఐదవ సెమిస్టర్ విద్యార్థులకు గురువారం, శుక్రవారం (రెండురోజుల పాటు) వైవా – వోస్ నిర్వహించారు. మొదటి రోజు ‘‘ఆల్టర్నేటీవ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్స్’’ అనే అంశంపై నిర్వహించిన వైవా – వోస్‌కు నిజామాబాద్ నుంచి సీనియర్ అడ్వకేట్ జె. వెంకటేశ్వర్లు ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్‌గా హాజరైనారు.
రెండవ రోజు ‘‘ప్రొఫెషనల్ ఎతిక్స్’’ అనే అంశంపై నిర్వహించిన వైవా – వోస్‌కు నిజామాబాద్ నుంచి సీనియర్ అడ్వకేట్ రామాగౌడ్ ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్‌గా హాజరైనారు. కార్యక్రమంలో న్యాయ విభాగాధిపతి, బిఒఎస్ చైర్ పర్సన్ డా. బి. స్రవంతి, అసోసియేట్ ప్రొఫెసర్ డా. జెట్లింగ్ ఎల్లోసా, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ప్రసన్న రాణి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్. ఆరతి శుభాభినందనలు తెలిపారు.