కామారెడ్డి, మార్చ్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని 22 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 14 లక్షల 40 వేల రూపాయల చెక్కులను, కామారెడ్డి నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు భిక్కనూర్ మండలంలోని లక్ష్మీదేవుని పల్లి గ్రామానికి చెందిన నాగర్తి నర్సా రెడ్డి, పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రాములు, జంగంపల్లి గ్రామానికి చెందిన ధర్మారెడ్డి గారి రాజి రెడ్డిలు ప్రమాదవశాత్తు మృతి చెందగా వారి వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున మొత్తం 6 లక్షల రూపాయల ప్రమాద భీమా చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,158 మందికి 7 కోట్ల 48 లక్షల 42 వేల 800 రూపాయల కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ చెక్కులను పంపిణీ చేసినట్టు తెలిపారు. ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, రోడ్డు ప్రమాదాలను గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కర్చైన డబ్బులను ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు.
సంక్షేమ, అభివ ృద్ధి కార్యక్రమాలను ఒకవైపు పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని మరోవైపు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన అన్నారు.