డిచ్పల్లి, మార్చ్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కోర్టులో పోక్సో కేసుల కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రారంభోత్సవం శనివారం ఉదయం నిజామాబాద్‌లోని ప్రధాన కోర్టు ఆవరణలో జరిగింది. కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, జిల్లా న్యాయమూర్తి జస్టిస్ సునీతా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజారెడ్డి తదితరులు హాజరైనారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగానికి చెందిన విభాగాధిపతి డా. బి. స్రవంతి, న్యాయ విభాగ విద్యార్థులు లక్ష్మీ ప్రసన్న, బంగారు విజయ్, రమాకాంత్, నరేంద్రనాథ్, ఎస్. రాజు, పి. రాజు, జ్యోత్స్న తదితరులు పాల్గొని ప్రముఖ న్యాయమూర్తులను కలిసి అభినందనలు తెలిపారు.