కామారెడ్డి, మార్చ్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యాయ వ్యవస్థకు న్యాయవాదులే పునాదులని సత్వర న్యాయానికి తమ వంతు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బిక్షపతి అధ్యక్షత వహించారు.
కామారెడ్డిలో నూతనంగా అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తామని జస్టిస్ విజయ సేనారెడ్డి పేర్కొన్నారు. మొదట సేనారెడ్డి కామారెడ్డి కోర్టు ప్రాంగణాన్ని కలియతిరిగారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి కామారెడ్డి అదనపు జిల్లా కోర్టు జడ్జి రమేష్ బాబు, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, జూనియర్ సివిల్ జడ్జి స్వాతి, మురారి, మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ వెంకటేష్ ధ్రువ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అదనపు ఎస్పీ అన్యోన్య, డీఎస్పీ సోమనాథం తదితరులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కామారెడ్డి కోర్టులో ఉన్న సమస్యలను జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బిక్షపతి జస్టిస్ విజయ సేనా రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జస్టిస్ విజయ సేనా రెడ్డిని కామారెడ్డి బార్ అసోసియేషన్ తరపున ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా న్యాయమూర్తులు, అధికారులు సీనియర్ న్యాయవాదులు రామచంద్రారెడ్డి, జగన్నాథం, శంకర్ రెడ్డి వెంకట్ రామ్ రెడ్డి, రమేష్ నంద, నిమ్మ దామోదర్ రెడ్డి, జోకుల గంగాధర్ గంగాధర్, శ్రీకాంత్ గౌడ్ దేవేందర్ గౌడ్, చంద్రశేఖర్, జుడిషియల్ ఎంప్లాయిస్ పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొదటగా జస్టిస్ విజయ సేనా రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.