కామారెడ్డి, మార్చ్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డుప్రమాదాలను, మరణాల మరియు క్షతగాత్రుల సంఖ్యను తగ్గించే చర్యలలో భాగంగా మరియు ఉన్నత న్యాయస్తానముల, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నేటి నుండి జాతీయ రహదారి ఎన్‌హెచ్-44 (బిక్కనూర్ నుంచి దగ్గి అటవీ ప్రాంతం-కామారెడ్డి జిల్లా పరిదిలో) స్పీడ్ లిమిట్ ‘‘80’’ చేసినట్టు కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
వాహనదారులు ఎవరైనా తమ వాహనాలను పరిమితికి మించి వేగముగా నడిపినచో జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. ఇకపై ప్రతి వాహనదారులు కూడా స్వతహాగా రోడ్డు భద్రత నియమ నిబంధనలను పాటిస్తూ అదేవిధముగా పరిమితి వేగమును మించకుండా ప్రయాణం చేస్తూ సురక్షితముగ గమ్యములకు చేరే విదముగా ప్రయాణించగలరని పేర్కొన్నారు. ఇలా చేసినచో మనతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చేసినవారము అవుతామని అన్నారు.