నిజామాబాద్, మార్చ్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు శనివారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం జరిగిన ఐదవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థీయరీ పరీక్షల్లో మొత్తం 6938 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 6544 మంది హాజరు, 394 గైర్హాజరు అయినట్లు ఆమె తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షల్లో మొత్తం 11138 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 10108 మంది హాజరు, 1030 గైర్హాజరు అయినట్లు ఆమె తెలిపారు.
బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కె కళాశాలలో గల పరీక్షాకేంద్రంలో మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షల్లో పొలిటికల్ సైన్స్, కెమిస్ట్రీలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఇద్దరు డిబార్ అయినట్లు ఆమె పేర్కొన్నారు.