భీమ్గల్, మార్చ్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం మహిళ దినోత్సవం సందర్భంగా తెరాస వర్కింగ్ ప్రేసిడెంట్ కెటిఆర్, మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం పట్టణంలోని మహిళలందరు చాలా ఉత్సహంతో వేడుకలు జరుపుకున్నారు. అదేవిధంగా భీంగల్ పట్టణ చైర్ పర్సన్ కన్నె ప్రేమలత సురేంధర్ పట్టణంలోని మెప్మా, ఏఎన్ఎం, ఆషావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులని ఘనంగా శాలువా కప్పి, మొక్క అందజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని మహిళల కోసం ఏర్పాటు చెసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ కౌన్సిరర్లు గంగన్న, లింగం, లత, నర్సయ్య , శమిమ్ బేగం, సతీష్ గౌడ్, భూదేవి, కైరీనిస బేగం, ప్రసాద్, కో అప్షన్ మెంబెర్స్ నవీన్, అజ్మతుల్ల, రైతు బంధు అధ్యక్షుడు బాధవత్ శర్మ నాయక్, పార్టీ యువ నాయకులు సునీల్ నారాయణ, రావుట్ల అరవింద్, లడ్డు, పార్టీ కార్యకర్తలు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్స్, పారిశుద్ధ్య కార్మికులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.