Daily Archives: March 7, 2022

కోమటి చెరువు అందాలకు కామారెడ్డి కలెక్టర్‌ ఫిదా

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోమటి చెరువు అందాలకు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఫిదా అయ్యారు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసిజిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కోమటి చెరువును సందర్శించారు. తీగెల వంతెనపై కాలినడకన కోమటి చెరువు అందాలను వీక్షించారు. చెరువులో బోటు షికారు చేస్తూ లేజర్‌ లైట్‌, మ్యూజికల్‌ ఫౌంటెన్‌ షోను తిలకించి మంత్ర ముగ్ధులయ్యారు. …

Read More »

ప్రభుత్వ బడుల్లో అవసరం ఉన్న పనులనే చేపట్టాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద తొలి విడతలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో అవసరం ఉన్న పనులను మాత్రమే గుర్తించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో ఆయన సంబంధిత శాఖల అధికారులతో మన ఊరు – మన బడి, హరితహారం, దళిత బంధు, ఉపాధి హామీ అమలు తీరుపై …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన రెండవ …

Read More »

ధరణి టౌన్‌షిప్‌లో చదరపు గజం ధర రూ. 7000

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్లో చదరపు గజం ధర రూ 7000 ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్‌ జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్‌ హాల్లో సోమవారం టౌన్షిప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. గతంలో ప్రభుత్వం చదరపు గజం ధర రూపాయలు 10000 నిర్ణయించిందని చెప్పారు. సామాన్య ప్రజలు …

Read More »

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించాలని సూచించారు. ప్రజల నుంచి ఈ సందర్భంగా ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, ఏవో రవీందర్‌, వివిధ శాఖల …

Read More »

మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు

నిజామాబాద్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్‌ ఔట్‌ రీచ్‌ బ్యూరో నిజామాబాద్‌ యూనిట్‌, మహిళా శిశు, దివ్యాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ కామారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు మంగళవారం బహుమతులను ప్రదానం చేస్తారు. కార్యక్రమంలో ఫీల్డ్‌ పబ్లిక్‌ ఆఫీసర్‌ కె. శ్రీనివాస్‌ రావు, జిల్లా …

Read More »

ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ

నిజామాబాద్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రజావాణికి మొత్తం 104 …

Read More »

టిఎన్‌జీవోస్‌ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం టీఎన్జీవో ఆధ్వర్యంలో ఎంప్లాయిస్‌ జేఏసీ చైర్మన్‌ అలుక కిషన్‌ అధ్యక్షతన టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ దాదన్న గారి విట్టల్‌ రావు, నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌, టిఎస్‌డబ్ల్యుడిసి చైర్మన్‌ ఆకుల లలిత, మెడికల్‌ సూపరింటెండెంట్‌ ప్రతిమా రాజ్‌, …

Read More »

టియులో స్పోర్ట్స్‌ బోర్డ్‌ ఏర్పాటు

డిచ్‌పల్లి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సోమవారం స్పోర్ట్స్‌ బోర్డు ఏర్పాటు చేయబడిరదని స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి. రాంబాబు తెలిపారు. బోర్డు కమిటీలో మొత్తం 11 మంది సభ్యులు ఉంటారన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించామని తెలిపారు. బోర్డుకు చైర్మన్‌గా తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, కన్వీనర్‌గా డాక్టర్‌ జి రాంబాబు వ్యవహరిస్తారని అన్నారు. కమిటీలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »