డిచ్‌పల్లి, మార్చ్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సోమవారం స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేయబడిరదని స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డైరెక్టర్ డాక్టర్ జి. రాంబాబు తెలిపారు. బోర్డు కమిటీలో మొత్తం 11 మంది సభ్యులు ఉంటారన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించామని తెలిపారు. బోర్డుకు చైర్మన్‌గా తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, కన్వీనర్‌గా డాక్టర్ జి రాంబాబు వ్యవహరిస్తారని అన్నారు.
కమిటీలో తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె. శివ శంకర్‌తో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య రాజేష్ కుమార్, ఆచార్య కె. దీప్లా, విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్ ఆరతి, గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు డా. వి. లక్ష్మీనారాయణ, కామారెడ్డి డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఇ. రాజ్ కుమార్, బి. భాస్కర్, ఖాదర్ మొహియుద్దీన్ సభ్యులుగా ఉంటారని అన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్) బిఆర్ నేతా స్పోర్ట్స్ బోర్డుకు కో – కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారన్నారు.
బోర్డు విధి విధానాలు
ప్రతి సంవత్సరానికి కనీసం మూడు సార్లు సమావేశం కావడం
క్రీడల ప్రణాళికను రూపకల్పన చేయడం
ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ నిర్వహించడం
క్రీడా క్యాలెండర్ విడుదల చేయడం
క్రీడలకు ప్రత్యేకమైన ఆదాయ వ్యయ నివేదికలను సమర్పించడం
ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ ఫీజుల ద్వారా బడ్జెట్ సమకూర్చడం
యూనివర్సిటీలో క్రీడా ప్రాంగణాన్ని మరియు వసతులను మెరుగు పరిచే విధంగా చేయడం
వీసీ, రిజిస్ట్రార్‌లు టీయూలో క్రీడా సామర్థ్యాన్ని పెంపొందింపజేయడానికి స్పోర్ట్స్ బోర్డ్ ఏర్పాటు చేసినందుకు టీయూ క్రీడాకారులు, డైరెక్టర్, పీడీలు హర్షం ప్రకటించారు.