కామారెడ్డి, మార్చ్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించాలని సూచించారు. ప్రజల నుంచి ఈ సందర్భంగా ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఏవో రవీందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.