కామారెడ్డి, మార్చ్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్లో చదరపు గజం ధర రూ 7000 ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో సోమవారం టౌన్షిప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
గతంలో ప్రభుత్వం చదరపు గజం ధర రూపాయలు 10000 నిర్ణయించిందని చెప్పారు. సామాన్య ప్రజలు కొనుగోలు చేయాలని సదుద్దేశంతో ప్రభుత్వం చదరపు గజానికి రూపాయలు 3000 లు తగ్గించిందని చెప్పారు. ఈనెల 14 నుంచి 17 వరకు బహిరంగ వేలం ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగలవారు కలెక్టర్ కామారెడ్డి పేరిట ఈఎండి రూ. 10,000 చెల్లించి చెక్కులను తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
ప్లాట్లు కొనుగోలు చేసిన ఏడు రోజుల లోపు 33శాతం డబ్బులు చెల్లించాలని చెప్పారు. 45 రోజుల తర్వాత 33శాతం, 90 రోజుల లోపు 34 శాతం మొత్తం 100 శాతం చెల్లింపులు చేయాలని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు బ్యాంకు రుణం పొందే విధానంపై లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజేందర్ రెడ్డి వివరించారు. సదస్సులో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య, ఆర్డీవో శీను, ఏజీఎం సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.