నిజామాబాద్, మార్చ్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం టీఎన్జీవో ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ అలుక కిషన్ అధ్యక్షతన టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, నగర మేయర్ దండు నీతూ కిరణ్, టిఎస్‌డబ్ల్యుడిసి చైర్మన్ ఆకుల లలిత, మెడికల్ సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్, బ్రహ్మకుమారి మెడిటేషన్ సెంటర్ సునీత బహన్జీ, ఇతర మహిళ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి ఆధారం మహిళలని, మహిళలను గౌరవించబడిన చోట అద్భుత పరిణామాలు ఆవిష్కృతమవుతాయని, మరియు ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న టీఎన్జీవో నాయకులకు అభినందనలు తెలుపుతూ వారి క్రమశిక్షణను ప్రశంసించారు. జిల్లాలో గల అన్ని శాఖల ఉద్యోగుల్లో ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేసి ఉత్తమ సేవలకు గాను వారిని అభినందించి ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా జిల్లా కార్యదర్శి సంఘం అమృత్ కుమార్, మహిళా కార్యవర్గ సభ్యులు కెపి సునీత, వసుమతిదేవి, మంజుల, విజయలక్ష్మి, సహధ్యక్షులు చిట్టి నారాయణరెడ్డి, కోశాధికారి గంధం వెంకటేశ్వర్లు, టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖర్, జాఫర్, సత్యం, శ్రీనివాస్, నాగరాజు, సుమన్, జాకీర్, దినేష్, జనార్ధన్, అతీక్, ఉమ కిరణ్, తదితరులు హాజరయ్యారు.