గాంధారి, మార్చ్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్న బాధితునికి ఆక్సిజన్ కాన్సర్ట్రేటర్‌ను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అందజేశారు. గాంధారి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వడ్ల సత్తయ్యకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే సురేందర్‌ను కలిసి పరిస్థితి వివరించారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆక్సిజన్ కాన్సర్ట్రేటర్‌ను ఉచితంగా తన సహచరలతో పంపించారు. ఆక్సిజన్ పరికరాన్ని కొల్లా సుభాష్ నాయక్, గణేష్, శేఖర్లు బాధితుని ఇంటికి వతీసుకోని వెళ్లి అమర్చారు. అత్యవసర సమయంలో స్పందించిన ఎమ్మెల్యే సురేందర్‌కు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ధన్యవాదములు తెలిపారు.