గాంధారి, మార్చ్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మౌన దీక్ష చేపట్టారు. సోమవారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్బంగా కాంగ్రెస్ శాసన సభ ప్రతిపక్ష నాయకుడు బట్టీ విక్రమార్కను అసెంబ్లీ లో అవమాన కరంగా మాట్లాడం మండల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా టి పీసీసీ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం మౌన దీక్ష చేపట్టారు. దళిత ముద్దు బిడ్డను అవమాన పరచడం నియంత పాలనకు నిదర్శనం అన్నారు.రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతుందని అన్నారు.
అసెంబ్లీ అంటే మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని అలాంటి సభలో ముఖ్యమంత్రి, స్పీకర్ ప్రవర్తించిన తీరు సిగ్గుచేటుగా ఉందన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తూర్పు రాజులు, నాయకులు రమేష్ రావు, గోపాల్, నీల రవి, సంగని బాబా, శ్రీనివాస్, బాలకిషన్, శ్రవణ్, అశోక్, సంతోష్, భూమేష్, సాయిలు, భూపతి, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.