ఆర్మూర్, మార్చ్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం సుబ్బిరియల్ గ్రామంలో పయనీర్ సీడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తున్నారని మగవారితో పోలిస్తే ఆడవారు ఏ రంగంలోనూ వెనుక లేరని, ఆడవారు ప్రతి ఇంటిలో ఒక తల్లిగా చెల్లెలిగా వారు సేవ చేస్తున్నారని, ఉదయం లేచిన నుంచి రాత్రివేళ పడుకునే సమయం వరకు మహిళలు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారన్నారు.
స్త్రీ లేకపోతే మానవజాతికి మనుగడ లేదని ఏ ఇంట్లో అయితే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని, ప్రస్తుత వ్యవసాయ రంగంలో మగవారితో పోలిస్తే స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంటుందని, వ్యవసాయ రంగంలో స్త్రీలు కీలక పాత్ర పోషిస్తున్నారని వారి కృషితోటే నేటి వ్యవసాయం కొనసాగుతుందని వివరించారు. ఈ సందర్భంగా మహిళలకు శాలువాలతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా పయనీర్ సీడ్స్ యొక్క పి3302 అనే రకం వేసుకుని అధిక దిగుబడులు సాధించాలని వారు తెలిపారు. ఇది నీటి ఎద్దడిని తట్టుకుంటుందని తక్కువ కాల వ్యవధిలోనే పంట చేతికి వస్తుందని, దీని ద్వారా మరొక పంట వేసుకోవడానికి సమయం ఆదా అవుతుందని వివరించారు. పి3302 అనే రకం వేసుకుని అధిక దిగుబడులు సాధించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ స్థానిక డీలరు పేట మోహన్ రెడ్డి, కంపెనీ సిబ్బంది టిఎస్‌ఎం దిల్ రంజాన్ ఎండిఆర్‌లు జక్కా రమణయ్య దేవి సింగ్, గ్రామ మహిళలు పాల్గొన్నారు.