కామారెడ్డి, మార్చ్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి యువతకు విలువలతో కూడిన చదువులు అవసరమని కామారెడ్డి జిల్లా కోర్టు జడ్జి రమేష్ బాబు పేర్కొన్నారు. మంగళవారం కోర్టు సముదాయంలోని బార్ అసోసియేషన్ హాలులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జడ్జి రమేష్ బాబు మాట్లాడుతూ మహిళా శక్తి ముందు ఏ శక్తి పనిచేయదని ఆయన పేర్కొన్నారు. నేటి మహిళలు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారు అని పేర్కొన్నారు. బాలురతో పాటు బాలికలకు కూడా విద్యాభ్యాసం చేయించాలన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి ప్రథమ శ్రేణి మెజిస్ట్రేట్ స్వాతి మురారిని జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
మహిళా న్యాయవాదులు స్వాతి రెడ్డి, షబానా బేగం, ప్రమీల లతాలను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో దూసుకెళ్తా ఉండడం గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణ జుడిషియల్‌లో మహిళ న్యాయమూర్తులు మహిళా ఉద్యోగులు రోజురోజుకు పెరుగుతూ ఉండడం శుభపరిణామమన్నారు.
కార్యక్రమంలో సివిల్ జడ్జి శ్రీనివాస్, జూనియర్ సివిల్ జడ్జి కం మొబైల్ మెజిస్ట్రేట్ వెంకటేష్ సీనియర్ న్యాయవాదులు రమేష్ చంద్, వెంకట్రాంరెడ్డి అమృత రావు, జోగుల గంగాధర్, దేవేందర్ గౌడ్ సూర్యప్రసాద్, వెంకట్ రామ్ రెడ్డి, సిద్ధరాములు కేతన్ జగన్నాథం, రజినీకాంత్, చింతల గోపి, పీలు నందా రమేష్, నిమ్మ దామోదర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, జూనియర్, సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.