కామారెడ్డి, మార్చ్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణాల్లో అనుమతి లేకుండా గృహాలు, వ్యాపార సముదాయాలు నిర్మిస్తే వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ రోడ్లను ఆక్రమించి ఎవరైనా నిర్మాణాలు చేపడితే వాటిని నిలుపుదల చేయించి తొలగించాలని సూచించారు.
నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించాలని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నట్లతే వాటిని నిలుపుదల చేయాలన్నారు. మునిసిపల్, రెవిన్యూ, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఆర్‌డివోలు రాజాగౌడ్, శీను, డిఎస్పిలు జైపాల్ రెడ్డి, శశాంక్ రెడ్డి, సోమనాథం, మున్సిపల్ కమిషనర్లు రమేష్ కుమార్, దేవేందర్, అధికారులు పాల్గొన్నారు.