కామారెడ్డి, మార్చ్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలలో ఆపరేషన్ నిమిత్తమై నిజాంసాగర్ మండలానికి చెందిన సుజాతకు కావలసిన ఓ పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో పట్టణానికి బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టబోయిన స్వామి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి సకాలంలో రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు.
రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడాలని 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన యువతీ యువకులు సంవత్సరానికి 4 సార్లు రక్తదానం చేయవచ్చునని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి సకాలంలో రక్తం అందించడానికి సిద్ధంగా ఉంటామని, ఎవరికైనా రక్తం అవసరం ఉన్నట్లయితే 9492874006 కి సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, చంద్ర కిరణ్, టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.