కామారెడ్డి, మార్చ్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వీధి వ్యాపారులకు రెండో విడత రుణాలు ఇప్పించడంలో కామారెడ్డి జిల్లా దేశంలో మొదటి స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం డిసిసి, డిఎల్‌ఆర్‌సి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
పంట రుణాలు అర్హతగల రైతులందరికీ అందించాలని సూచించారు. రుణ లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తిచేయాలని చెప్పారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ ఏడాది జిల్లాలో 1800 మంది వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. విద్య, గృహ, వ్యవసాయ రుణాలపై బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నాబార్డ్ ఆధ్వర్యంలో పెద్ద మల్లారెడ్డి, రెడ్డి పేట గ్రామాల్లో కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేయడానికి రూ .15 లక్షల చొప్పున చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజేందర్ రెడ్డి, జిల్లా షెడ్యూల్ కులాల అధికారిణి రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి అంబాజీ, బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.