నిజామాబాద్, మార్చ్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉత్తర్రప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తారఖండ్ రాష్ట్రాలలో భారతీయ జనతాపార్టీ విజయం భారత ప్రజల విజయమని భాజపా లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్ సుబేదార్ అన్నారు. జిల్లా కోర్టు చౌరస్తాలో టపాకాయాలు కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరిపిన అనంతరం ఆయన మాట్లాడారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వం పట్ల ప్రజల విశ్వాసం, యోగి ప్రగతి కార్యక్రమాల కలబోత కలిసి అఖండ విజయానికి మార్గం చూపాయని తెలిపారు. భవిష్యత్ భారత ప్రతి ఎన్నికలలో భాజపా విజయాలే ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
బలమైన జాతీయ నాయకత్వం ఉంటేనే బలమైన భారత్ నిర్మాణం సాధ్యమని ఆ నాయకత్వం భాజపాలో ఉందన్నారు. భాజపాకు విజయాన్ని చేకూర్చిన నాలుగు రాష్ట్రాలలోని ప్రజలకు ఆయన ప్రత్యేకత కృతజ్ఞతలు తెలిపారు. సంబరాలలో న్యాయవాదులు జగన్ మోహన్ గౌడ్, బిట్ల రవి, వసంత్ రావు, సంతోష్ నాగ్, కేశవరావు, యాదగిరి, బెల్లాల్ కృష్ణ, నారాయణ దాసు, అమరెందర్ రావు, బాలరాజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.