కామారెడ్డి, మార్చ్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎక్లార బాలికల వసతి గృహంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం బాలికలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు.
విద్యార్థులు ఇష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని కోరారు. బిచ్కుంద ఎస్సీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులతో వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.