కామారెడ్డి, మార్చ్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్, రామంతపూర్లలో ఒకటో తరగతి ప్రవేశం కొరకు అర్హులైన గిరిజన విద్యార్థి, విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆధ్వర్యంలో ఓ చిన్నారితో (లాటరీ) లక్కీడ్రా తీయించారు.
ఇద్దరు బాలికలు, ముగ్గురు బాలురు మొత్తం ఐదుగురు ఎంపికయ్యారు. కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, సీనియర్ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు.